ఆలమూరు: అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించాలి

53చూసినవారు
ఆలమూరు: అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించాలి
సామాజిక వివక్షతను, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆలమూరు నాయకులు వ్యాఖ్యానించారు. తెదేపా నాయకుడు ఈదల సత్తిబాబు ఆధ్వర్యంలో సోమవారం బాబాసాహెబ్ జయంతి వేడుకల్లో భాగంగా ఆలమూరు ఎస్సీ పేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్