తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (APSDMA) సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దుద్దుకూరు, గౌరీపట్నం, గ్రామంలో పలు చోట్ల వాతావరణం చల్లబడింది. నిన్న అధిక ఉష్ణోగ్రత 41డిగ్రీలు ఉండగా, నేడు కాస్త వాతావరణం ఉపశమనం కలిగించింది. ఈ క్రమంలో గురువారం వరకు ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.