కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం రామాలయం విధిలో గల ఓ ఇంట్లో శనివారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యుట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కాకినాడ అగ్నిమాపక శాఖ అధికారి హుటాహుటిన అక్కడకు చేరుకొని సిబ్బందిచే మంటలను అదుపు చేశారు. ఆస్తి నష్టం, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.