మన సం స్కృతిలో జానపద కళలు ప్రధాన భాగ మని, ఆచార వ్యవహరాలకు అద్దం లాంటి వాటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిఆర్ఓ డి తిప్పే నాయక్, డిడి నాగార్జున అన్నారు. గురువారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద అంతర్జాతీయ జానపద కళల దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా జానపద కళాకారుల సంక్షేమ సంఘం ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డిఆర్ఓ డి తిప్పే నాయక్, డిడి నాగార్జున జండా ఊపి ప్రారంభించారు.