లయన్స్ ఇంటర్నేషనల్ లయన్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో ఉచిత హోమియో క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగిందనిలయన్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ రామారావు పేట లయన్స్ క్లబ్ కాకినాడ కమ్యూనిటీ హాల్లో ఉచిత హోమియో క్లినిక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఉదయం పదిగంటల నుండి 11: 30 వరకుఉచిత హోమియో క్లినిక్ నిర్వహించడం జరుగుతుందన్నారు.