కాకినాడ కార్పొరేషన్ లో పాత ఉమ్మడి జిల్లా పరిధిలో గ్రామ, వార్డు సచివాలయ సెక్రెటరీలకు సంబంధించి సాధారణ బదిలీ ప్రక్రియ చేపట్టినట్లు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు. గురువారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పరిధిలో గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన సెక్రటరీలకు సంబంధించి సాధారణ బదిలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారదర్శకంగా బదిలీలు చేపడతామని తెలిపారు.