కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రీ ఎంక్వయిరీ చేస్తాం

76చూసినవారు
కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రీ ఎంక్వయిరీ చేస్తాం
ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసిన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ గురువారం గొల్లల మామిడాడలో పరామర్శించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిని ఈ రకంగా హత్య చేయడం దారుణమని తెలిపారు. సుబ్రహ్మణ్యం తల్లికి ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు. కేసును రీ ఎంక్వైరీ చేసి నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్