కాకినాడ నగరంలో గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు వర్షం పడటంతో సేద తీరారు. సాయంత్రం నాలుగు గంటల అయ్యేసరికి ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకుని చీకటిని తలపించింది. అనంతరం కాకినాడ నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.