స్వచ్ఛ కాకినాడకు ప్రతి ఒక్కరు సహకరించాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకటరావు పేర్కొన్నారు. సోమవారం కాకినాడలో స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ వివేకానంద పార్కు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం కలెక్టర్ లోని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు.