కాకినాడ: నెల రోజులుగా తాగునీరు లేక నరకయాతన

54చూసినవారు
కాకినాడ: నెల రోజులుగా తాగునీరు లేక నరకయాతన
ఒక రోజు నీళ్లు లేకపోతేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది కాకినాడ శివారులోని తూరంగి పంచాయతీకి చెందిన సత్యదుర్గానగర్, గోపీకృష్ణ కాలనీ, శివకృష్ణ కాలనీ, ఈశ్వర్ కాలనీ, బుల్లబ్బాయిరెడ్డి నగర్‌లలో మూడు వేల కుటుంబాలు గత నెల రోజులుగా నీటి కోసం నరకయాతన పడుతున్నాయి. ట్యాంకర్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. బోరుబావుల్లో ఉప్పు నీటి తెచ్చుకుంటూ, తాగేందుకు వాటర్ క్యాన్సు కొనుక్కుంటూ అవస్థలు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్