విశాఖ షీలానగర్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తగా పెళ్లైన దంపతులు సాయినాగేంద్ర, శాలిని మృతి చెందారు. వీరు గాజువాక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్లు. నెలకు పైగా కాపురం చేసిన వీరు ఆర్కే బీచ్‌కు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. సాయినాగేంద్ర అక్కడే, శాలిని చికిత్సలో మృతి చెందింది. ఈ ఘటనతో కొమరగిరిలో విషాద ఛాయలు అలముకున్నాయి.