కాకినాడ: డిసెంబర్ 31న మద్యం అమ్మకాలను ఆపాలి

84చూసినవారు
కాకినాడ: డిసెంబర్ 31న మద్యం అమ్మకాలను ఆపాలి
నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో మద్యం ఏరులై పారుతోందని తద్వారా రోడ్డు ప్రమాదాలకు అవకాశాలు ఉన్నాయని డిసెంబరు 31న మద్యం విక్రయాలు ఆపాలని ప్రజా సంఘాల నాయకులు రమణ రాజు కోరారు. గురువారం సాయంత్రం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబరు 31 రాత్రి యువకులు మద్యం సేవించి నూతన సంవత్సరానికి స్వాగతం పేరుతో వివక్షత కోల్పోతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్