కాకినాడ వివేకానంద పార్కులో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం పురస్కరించుకుని గురువారం ఏర్పాటుచేసిన చిత్రకళ ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. మధర్ థెరిసా ఆర్ట్ అకాడమీ, మండపేట ఆధ్వర్యంలో డా.ఎం. సత్యనందం నిర్వహించిన జీవవైవిధ్య చిత్ర ప్రదర్శన (ఎగ్జిబిషన్) ప్రజల దృష్టిని ఆకర్షించింది. పక్షులు, వృక్షాలు, అడవి జంతువుల, తదితర రూపంలో అందించటం ద్వారా పర్యావరణ ప్రేమను ప్రేరేపించే అంశాలను ప్రజల్లో నాటారు.