అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న మాల కులానికి చెందిన నాయకులు జీవించే ఉన్నారా? అని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్. ఎస్ రత్నాకర్ ప్రశ్నించారు. ఎస్ సి వర్గీకరణ ను నిరసిస్తూ బుధవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బాల మహానాడు ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుయుక్తులను మాల నాయకులు ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు.