ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు ఆదివారం ఆటో ప్రచారాన్ని ప్రారంభించాయి. ఆదివారం ఇంద్రపాలెం లాకులు, అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభం అయిన ఆటో ప్రచార రథాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషాబాబ్జి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సమ్మె ఏర్పాట్లు ఉదృతంగా సాగుతున్నాయని, కాకినాడ జిల్లాలో సుమారు 50 వేల మంది కార్మికులు సమ్మెకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.