మే 22న జరగనున్న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి ఆధ్వర్యంలో కాకినాడ శాఖా గ్రంథాలయం, గాంధీనగర్ ప్రాంగణం (వివేకానంద పార్క్)లో గురువారం జిల్లాస్థాయి చిత్రలేఖనం, క్విజ్ పోటీలు , ప్రదర్శన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్ర జీవవైవిధ్య మండలి ప్రాంతీయ సమన్వయకర్త వి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, జీవవైవిధ్యం భూమికి శ్వాస వంటిదని పేర్కొన్నారు.