నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ అని, ఆయన యావత్ ప్రపంచానికి ఆదర్శనీయం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి, ఎమ్మెల్యే కొండబాబు, అభివర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాత బి. ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని సోమవారం కాకినాడ ఇంద్ర పాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.