ఆధునిక పరిజ్ఞానంతో కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో వెబ్ ఎక్విప్మెంట్ రూమ్ ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా పోలీసులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుటకు, సాంకేతిక పరికరాలతో కూడిన వెబ్ ఎక్విప్మెంట్ రూమును అందుబాటులో ఏర్పాటు చేశామన్నారు.