కాకినాడ నగరంలో తూరంగి విలీనం చేపట్టాలి

59చూసినవారు
కాకినాడ నగరంలో తూరంగి విలీనం చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం సభ్యులు రమణ రాజు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పౌర సంక్షేమసంఘం పిలుపు మేరకు కాకినాడ అర్బన్ తూరంగి గ్రామంలో విశ్రాంత అధ్యాపకులు జోగాఅప్పారావు అధ్యక్షతన జయప్రకాష్ నగర్ లో స్థానిక పౌర సమావేశం జరిగింది. 25వేల జనాభా వున్న తూరంగి అర్బన్ లో కార్పోరేషన్ పౌర సౌకర్యాలు కల్పించడం లేదని పంచాయతీ స్థాయి నిర్వహణ కూడా కరువయ్యిందని సమావేశంలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్