సాయుధ బలగల జెండా దినోత్సవం పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాయుధ దళాల పతాక దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ సాయుధ దళాల పతాక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు ఏడవ తేదిన నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. సాయుధ దళాలు దేశరక్షణ కొరకు అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందని. మన భద్రతను, దేశ క్షేమానికి కోసం పనిచేయడం జరుగుతుందని తెలిపారు.