స్మార్ట్ సిటీ కాకినాడను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత నగర ప్రజల అందరిపైనా ఉందని, పారిశుధ్య నిర్వహణ విషయంలో సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కమిషనర్ భావన అన్నారు. పారిశుధ్య తనిఖీల్లో భాగంగా శనివారం తెల్లవారు జామునేకమిషనర్ భావన నగరంలో పర్యటించారు. 32, 33 డివిజన్లలో సీసీ థియేటర్, ఆనంద్‌భారతి రోడ్డు, రామకృష్ణారావు పేట, లచ్చిరాజు వారి వీధి ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించారు.