కూటమితోనే రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి జరుగుతుందని కాకినాడ జిల్లా టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొల్లాబత్తుల అప్పారావు అన్నారు. బుధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ఎస్సీల అభివృద్ధి కోసం అనేక రుణాలను ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేసిందన్నారు. దీనిని ఎస్సీలు వినియోగించుకోవాలని కోరారు.