ఆలిండియా నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ విజేత మందపల్లి శ్రీనివాసరావును గురువారం సాయంత్రం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 21నుంచి 23 వరకు పంజాబ్ ఖరార్ లో జరిగిన రైతు బారా యూనివర్సిటీ నిర్వహించిన ఆలిండియా నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలోకాకినాడ ఆర్చ్ టిసి డిపోలో డ్రైవర్ శ్రీనివాసరావ ప్రథమ స్థానంలో నిలిచారన్నారు.