అనాధ మృతదేహాలను ఉచితంగా స్వయంగా అంత్యక్రియలు చేసే అందరికీ ఆదర్శం నిలిచిన కూపర్ భాను అంబేద్కర్ ను కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఘనంగా సత్కరించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాల్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కూపర్ భాను అంబేద్కర్ ను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ , జిల్లా అధికారులతో కలిసి ఘనంగా సత్కరించి, ఆయనకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.