కాకినాడ జిల్లా యుటిఎఫ్ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సు విజయవంతమైంది. యుటిఎఫ్ కాకినాడ జిల్లా సహాధ్యక్షులు వివి రమణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకి జిల్లా అధ్యక్షుడు కెవివి నగేష్ ఆహ్వానం పలికారు. కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ డిఎస్సి పరీక్షకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు మానసికంగా ధైర్యంగా ఉండాలన్నారు. డిఎస్సి అభ్యర్థుల విన్నపాలను తమ పరిధిలో ప్రభుత్వానికి తెలియ చేస్తున్నామన్నారు.