అమిత్ షాను తక్షణం బర్తరఫ్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం, మాల మహానాడు జెఏసి అధ్యక్షులు లింగం శివప్రసాద్, రామేశ్వరరావు, కండవల్లి లావరాజు, పేర్కొన్నారు. మంగళవారం బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.