బరువు, పొడవులకు సంబంధించి నాణ్యత లోపాలు, మోసాలను నియంత్రించేందుకు లీగల్ మెట్రాలజీ శాఖ కృషి చేస్తోందని లీగల్ మెట్రాలజీ శాఖ జాయింట్ కంట్రోలర్ పి. సుధాకర్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో కళ్యాణ మండపం లో లీగల్ మెట్రాలజీ శాఖ ప్రపంచమెట్రాలజీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వినియోగదారులకు వ్యాపార సంస్థలలో ఉపయోగించే కటాలు వాటి ముద్రణ వంటి అంశాలపై అవగాహన కలిపిస్తున్నామన్నారు.