ఒకటో తేదీకి ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకు జీతాలు రావడం జరుగుతుందనిఏపీ జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం ఏపీఎస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కాకినాడ జిల్లా బ్రాంచ్ లో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్ పి శాస్త్రి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కే పద్నాలుగు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.