కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెవెన్యూ ఉద్యోగుల సౌకర్యార్థం డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం కాకినాడ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకటరావు. రెవెన్యూ అధికారులతో కలిసి ప్రారంభించారు. వివిధ మండలాలకు చెందిన సుమారు 450 మంది రెవెన్యూ ఉద్యోగులు వారి కుటుంబీకులు ఈ కంటి వైద్య శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.