కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు కిటకిటలాడారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వివిధ రంగాలతో ఆసుపత్రికి వచ్చారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఓపీ కిరోగులు అధికంగా రావడంతో జీజీహెచ్ సూపర్డెంట్ లావణ్య కుమారి రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఓపీ విభాగాల వద్ద డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా వ్యాధి గ్రస్తుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు.