సముద్రంపై 61వ రోజులపాటు వేట నిషేధం అనంతరం ఆదివారం నుంచి మత్స్యకారులు సముద్రం పై వేటకు వెళ్లడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడ జగన్నాధపురం ఏటుమొగా లో గల శ్రీ శ్రీ శ్రీ గణపతి, కాలభైరవ స్వామి, గంగాలమ్మ తల్లి వార్లు ఆలయం వద్ద కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోర్డు ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆలయ కమిటీ ఆధ్వరయం లో స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు.