బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారడంతో శనివారం కాకినాడలో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయయ్యాయి. భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో 24 గంటలపాటు భారీ వర్షలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ కారణంగా సముద్రంలోకి వేటకు వెళ్ళద్దని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షం కారణంగా రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.