వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను వాడాలని ట్రాఫిక్ సిఐరమేష్ పేర్కొన్నారు. కాకినాడలో శనివారం సాయంత్రం మెయిన్ రోడ్ లో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అదేవిధంగా సైబర్ నేరాలపై వివరించడం జరుగుతుందని తెలిపారు. ఆధునిక పద్ధతిలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.