హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటన మంగళవారం సరూర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కాకినాడ జిల్లా తొండంగి మండలానికి చెందిన అమ్ములు (61), మరియా దాస్ (35) 2013లో పెళ్లి చేసుకున్నారు. భార్యపై అనుమానంతో దాస్ తరచూ గొడవపడేవాడు. చివరికి చున్నీతో మెడను బిగించి హత్య చేశాడు. పోలీసులు దాసును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.