కాకినాడ వన్‌టౌన్ పోలీసులు ఆదివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న14 మందిని పట్టుకున్నామని అని సీఐ నాగ దుర్గారావు తెలిపారు. సోమవారం వారిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. పదిమందికి ఒక్కోరి రూ.10 వేల జరిమానా విధించగా, ఇద్దరికి ఒకరోజు, మరో ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష కూడా విధించినట్లు ఆయన తెలిపారు.