కాకినాడ నగర పరిధిలో పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన కొత్త నేరస్థుడు సుంకర తేజను అరెస్టు చేసినట్లు ఇన్ చార్జ్ డిఎస్పి ఆర్ రామచంద్రరావు క్రైమ్ సిఐలు ఎం.నాగ దుర్గారావు, బి.కృష్ణ తెలిపారు. శుక్రవారం కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు, కాకినాడ పర్లోవపేట రాజీవ్ గృహ కల్పనకు చెందిన సుంకర తేజ జల్సాలకు అలవాటు పడి ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు.