కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గా కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను రాష్ట్ర ప్రభుత్వం నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం కాకినాడ కలెక్టరేట్ లో కాకినాడ నగరపాలక సంస్థ ప్లానింగ్ అధికారి సీహెచ్. సత్యనారాయణ, ఎస్టేట్ అధికారి ఎస్. రామ్మోహాన్, అసిస్టెంట్ ఎకౌంటు అధికారి వి. కావ్య. జేసీ రాహుల్ మీనాను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.