కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, వారి ఆదేశాలతో కాకినాడ ట్రాఫిక్ పోలీస్ గురువారం సాయంత్రం ఆకస్మిక దాడులు చేసి సరైన నెంబర్ ప్లేట్ లేని 80 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుున్నారు. కాకినాడ 2వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ద్విచక్ర వాహన యజమానులు, వాహన చోదకులను ఉద్దేశించి మాట్లాడుతూ, సరైన నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలను నడపరాదని తెలిపారు.