కాకినాడ నగరంలోని జెఎన్టియుకె ఎదురుగా గల మైదానంలో కాశ్మీర్ సమ్మర్ ఎగ్జిబిషన్ పేరుతో కాశ్మీర్ ప్రకృతి అందాలను ప్రతిబింబించే ఎగ్జిబిషన్ ను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంధి బాబ్జి, కాకినాడ తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు వినోదం పంచే ఇలాంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.