డిసెంబర్ 3వ తేదిన జిల్లా స్థాయి పర్యవరణ సైన్స్ కాంగ్రెస్ ను జయప్రదం చేయవలసిందిగా జిల్లా విద్యాశాఖధికారి పి. రమేష్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శనివారం గోడపత్రిక ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. చెత్త నుంచి సంపద తయారు చేయుట అనే విషయంపై ప్రదర్శన చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.