కనీస వేతనాలు 36 వేలు అమలు చేయాలని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ పేర్కొన్నారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ కాకినాడ జిల్లా కౌన్సిల్ సమావేశం గురువారం కాకినాడలో సామ మూర్తి నగర్ లో గల పి. ఆర్ భవన్ లో పెద్ది రెడ్ల అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ హాజరయ్యారు.