కాకినాడ: ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి

61చూసినవారు
కాకినాడ అంబెడ్కర్ భవన్ లో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం నిర్వహించారు. ఈ సభకు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నర్ల ఈశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరయిన ఎన్ హెచ్ ఎం జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి. బేబిరాణి మాట్లాడుతూ ఆశాలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్