ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సిద్ధమవుతున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషబాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ సుందరయ్య భవన్ లో సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం సాయంత్రం నిర్వహించారు.