కాకినాడ: మాతా, శిశు మరణాలను నివారించేందుకు ప్రణాళిక

77చూసినవారు
కాకినాడ: మాతా, శిశు మరణాలను నివారించేందుకు ప్రణాళిక
మాతా, శిశు మరణాలను నివారించేందుకు మరింత మెరుగైన ప్రమాణిక వైద్య విధానాలను పాటించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి వైద్యాధికారులను కోరారు. కాకినాడలో శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో పిండలింగ నిర్థారణ నిషేద చట్టం (పిసిపిఎన్డిటి) అమలు, మాతా, శిశు మరణాల నివారణ అంశాలపై జిల్లా స్థాయి కమిటీల సమావేశాలు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్