కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్‌గా మార్చారంటూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్టులో తనిఖీలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియతో మాట్లాడారు. "ఎన్నికల సందర్భంగా మేం చేసిన పర్యటనల్లో(2019-24 మధ్య) కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించాం. అవినీతిని అరికడతామని ప్రజలకు మాట ఇచ్చాం. మేం వచ్చాక 51 వేల టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నాం" అని పవన్ పేర్కొన్నారు.