కాకినాడ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నాయకులు మోహన్ వర్మ, తోట నవీన్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకె శ్రీనివాస్ బాబా, మేక లక్ష్మణమూర్తి, మల్లిపూడి వీరు తదితరులు ప్రజల మధ్య నుండి వినతలు స్వీకరించారు.