ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల, అగ్నిమాపక సేవల శాఖ ఏడిఎఫ్ వి సుబ్బారావు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా అగ్నిమాపక కార్యాలయం వద్ద ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి ఏడాది అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.