ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేయబడిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్ఎస్) కార్యక్రమం ఈ నెల13 వ తేదీన సోమవారం సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దు చేసినట్టు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు, అధికారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ప్రజల సహకరించాలని ఆయన సూచించారు.