అంతర్జాతీయ కిక్‌బాక్సింగ్ లో శిక్షణలో ప్రతిభ చాటిన. కె. లేఖా నిహారిక ను కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం అభినందించారు. కాకినాడకు చెందిన లేఖా నిహారిక, ఇటివల కేరళలో జరిగిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ శిక్షణ శిబిరంలో తన ప్రతిభను చాటారు. తన ప్రతిభతో ఈమె జూన్ 12 నుండి 15 వరకు జరగబోయే 30వ హంగేరియన్ వాకో వరల్డ్ కప్ కు ఎంపిక కావడం జరిగిందని ఎస్పీ తెలిపారు.