సముద్ర తీరలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా తీరభద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడలో శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి కోస్టల్ సెక్యూరిటీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఏపీ మెరైన్ సెక్యూరిటీ పోలీస్ అడిషనల్ ఎస్పీ మధుసూదనరావు, ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ తదితర శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు.